ప్రపంచం

విమానం క్రాష్.. ఇద్దరు ఆర్మీ అధికారులు సహా 14 మంది దుర్మరణం

ఆఫ్రికా ఖండంలో మరో ఘోరప్రమాదం చోటుచేసుకుంది. కాంగో దేశంలో నిన్న ఘోర విమాన ప్రమాదం సంభవించింది. కిక్విట్ నుండి కాంగో రాజధాని కిన్షాసాకు వెళుతున్న విమానం కెంగే ప్రాంతంలో క్రాష్ ల్యాండ్ అయింది.ఈ ఘటనలో విమానంలోని ప్రయాణికులు మరణించారు.ప్రాణాలు కోల్పోయిన వారిలో ఇద్దరు మిలిటరీ అధికారులు సైతం ఉన్నట్టు సమాచారం. వారిలో ఒకరు లెఫ్టినెంట్ జనరల్ ముటొంబో కటలాయి టియెండే, మరొకరు సాయుధ దళాల ఆడిటర్ జనరల్ బకుమి లికులియా అని తెలుస్తోంది. అయితే, ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని అధికారులు వెల్లడించినట్టు సమాచారం.