తెలంగాణ
నాపై కుట్ర జరుగుతోంది- డీజీపీకి వీసీ జానయ్య సంచలన లేఖ
Aldas Janaiah: ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం (PJTAU) వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ అల్దాస్ జానయ్యపై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలు సంచలనం రేపుతున్నాయి. జానయ్య తనను లైంగికంగా వేధించాడని అసిస్టెంట్ ప్రొఫెసర్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ వ్యవహారంపై వీసీ జానయ్య స్పందించారు. డీజీపీ సీవీ ఆనంద్ కు లేఖ రాశారు. తనపై మహిళా ఫ్యాకల్టీ చేసిన ఆరోపణల వెనకున్న కుట్ర కోణాన్ని వెలికితీసి, నిష్పక్షపాతంగా విచారణ జరపాలని డీజీపీ సీవీ ఆనంద్‌ను కోరారు వీసీ జానయ్య. ఈ ఆరోపణల వెనుకున్న నిజానిజాలను నిగ్గుతేల్చాలన్నారు.
