National

phonepe diwali insurance: కేవలం రూ.11తో రూ.25,000 కవరేజీ.. ఫోన్‌పే దీపావళి బంపర్ ఆఫర్!

phonepe diwali insurance: దీపావళి పండుగ వచ్చిందంటే చాలు.. పిల్లల నుంచి పెద్దల దాకా అందరూ బాంబులు కాల్చడానికి తెగ ఉత్సాహం చూపిస్తుంటారు. అయితే ఎంత జాగ్రత్తగా ఉన్నా కొన్నిసార్లు అనుకోకుండా ప్రమాదాలు జరిగిపోతుంటాయి. అలాంటప్పుడు ఆసుపత్రి ఖర్చులు మీదపడితే సామాన్య కుటుంబాలకు చేతిలో చిల్లిగవ్వ లేక పెద్ద తలనొప్పిగా మారుతుంది. సరిగ్గా ఇలాంటి ఇబ్బందులు రాకుండా ఉండేందుకు ప్రముఖ యూపీఐ యాప్ ఫోన్‌పే ఓ అదిరిపోయే ప్లాన్ తీసుకొచ్చింది. కేవలం రూ.11 కడితే చాలు.. ఏకంగా రూ.25,000 వరకు వైద్య ఖర్చులకు భరోసా ఇచ్చేలా ప్రత్యేక బాణసంచా బీమాను (ఫైర్‌క్రాకర్ ఇన్సూరెన్స్) అందుబాటులోకి తెచ్చింది. ఆదిత్య బిర్లా హెల్త్ ఇన్సూరెన్స్‌తో కలిసి ఫోన్‌పే ఈ చిన్న బీమా పాలసీని వరుసగా మూడో ఏడాది కూడా అందిస్తోంది. పండుగ వేళ కాలిన గాయాలైనా లేదా ఇతర ప్రమాదాలు జరిగినా ఆసుపత్రి ఖర్చుల భారం పడకుండా ఇది అండగా నిలుస్తుంది.