తెలంగాణ
తుది దశకు ‘ఫోన్ ట్యాపింగ్’ కేసు.. కేసీఆర్, కేటీఆర్‌లకు బిగుస్తున్న ఉచ్చు?
తెలంగాణ రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టించిన ‘ఫోన్ ట్యాపింగ్’ కేసు దర్యాప్తు అత్యంత కీలకమైన తుది దశకు చేరుకుంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ కేసులో మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్(KCR)ను ప్రధాన నిందితుడిగా (A1), ఆయన కుమారుడు, మాజీ మంత్రి కేటీఆర్(KTR)ను రెండో నిందితుడిగా (A2) పేర్కొంటూ ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) తుది ఛార్జ్‌షీట్ దాఖలు చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది. నిబంధనలకు విరుద్ధమని తెలిసినప్పటికీ ఫోన్ ట్యాపింగ్‌కు అనుమతులు ఇవ్వడంతో పాటు, తమకు అనుకూలంగా ఉండే అధికారులను ఇంటెలిజెన్స్, స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (SIB) వంటి కీలక విభాగాల్లో నియమించి ఈ అక్రమాలకు పాల్పడ్డారని సిట్ అధికారులు భావిస్తున్నట్లు సమాచారం.
