తెలంగాణ
మళ్లీ తెరపైకి ఫోన్ ట్యాపింగ్ కేసు.. రేవంత్ రెడ్డి టార్గెట్ అదేనా?
తెలంగాణలో రోజురోజుకు తీవ్రతరమవుతున్న ప్రజా సమస్యలు, కరెంటు కోతలు, తాగునీటి ఇబ్బందులు, ఉమ్మడి ఉద్యోగ నోటిఫికేషన్లు, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలపై ప్రజలు, వివిధ వర్గాల నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి డైవర్షన్ డ్రామాలకు తెరతీశారనే విమర్శలు రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తున్నాయి. ప్రజల దృష్టిని ఇతర అంశాలపైకి మళ్లించే కుట్రలో భాగంగానే తాజాగా అత్యంత సున్నితమైన 'ఫోన్ ట్యాపింగ్' కేసును మళ్లీ తెరపైకి తీసుకురావాలని ప్రభుత్వం వ్యూహరచన చేస్తున్నట్లు తెలుస్తోంది.
