National
PetrolPumpUPI: పెట్రోల్ పంపుల్లో యూపీఐ పేమెంట్లపై డీలర్ల కీలక నిర్ణయం!
స్మార్ట్ఫోన్ చేతిలో ఉంటే చాలు పెట్రోల్ బంకుల్లో క్షణాల్లో యూపీఐ (UPI) ద్వారా డబ్బులు చెల్లించే సదుపాయానికి త్వరలోనే ఆటంకాలు ఎదురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అక్టోబర్ 15 నుంచి రూ.2,000కు మించిన ఎంపిక చేసిన డిజిటల్ వ్యాపార లావాదేవీలపై మర్చంట్ డిస్కౌంట్ రేట్ (MDR) అమలు చేయాలని కేంద్రం నిర్ణయించడమే దీనికి కారణం. ఈ కొత్త రుసుముల విధానంపై పెట్రోల్ పంప్ డీలర్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ కొత్త నిబంధనల ప్రకారం పెట్రోల్, రైల్వే, టెలికాం రంగాల్లో రూ.2,000 కంటే ఎక్కువ జరిగే ఒక్కో యూపీఐ లావాదేవీపై రూ.5ఫ్లాట్ ఎండీఆర్గా చెల్లించాల్సి ఉంటుంది.
