పెట్రోల్, డీజిల్ రేట్లు పెరుగుతాయా?
Petrol-Diesel Price : పశ్చిమాసియాలో పరిస్థితులు మరోసారి ఉద్రిక్తంగా మారాయి. అగ్రరాజ్యం అమెరికా - ఇరాన్ మధ్య దాడులు మరోసారి తీవ్రరూపం దాల్చడంతో వ్యూహాత్మకంగా కీలకమైన హార్ముజ్ జలసంధి పరిధిలో వాణిజ్య నౌకల రాకపోకలపై ప్రభావం పడుతోంది. చమురు ట్యాంకర్లు, ఇతర సరుకు రవాణా నౌకలపై దాడుల వార్తలు అంతర్జాతీయ ఇంధన మార్కెట్లలో మరోసారి ఆందోళన పెంచుతున్నాయి. ఈ పరిణామాల ప్రభావంతో ముడి చమురు ధరలు భారీగా పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ బ్యారెల్కు 100 డాలర్ల మార్కును దాటింది.హార్ముజ్ ప్రాంతంలో ఉద్రిక్తతలు పెరగడంతో అంతర్జాతీయంగా చమురు సరఫరాపై ఆందోళనలు తీవ్రమవుతున్నాయి. అమెరికా ఐదు ఇరాన్ చమురు ట్యాంకర్లను ధ్వంసం చేసినట్లు ప్రకటించిన తర్వాత, ఇరాన్ కూడా పలు నౌకలపై దాడులు చేసినట్లు వెల్లడించింది. ఇరుపక్షాల మధ్య ఈ దాడులు, ప్రతి దాడులు సముద్ర రవాణాపై మరింత ఒత్తిడి పెంచుతున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
