తెలంగాణ

22ఏ భూ సమస్యలకు శాశ్వత పరిష్కారమే లక్ష్యం

22A: తెలంగాణ రాష్ట్రంలో ఏళ్ల తరబడి పరిష్కారం కాని 22ఏ భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడమే తమ ప్రభుత్వం లక్ష్యం అని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. ఆ దిశగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను వేగవంతంగా క్షేత్ర స్థాయిలో పకడ్బందీగా అమలు చేసి దరఖాస్తుదారులకు ఉపసమనం కల్పించాలని కలెక్టర్లను ఆదేశించారు. నిర్ణయాల అమలు, సమస్యల పరిష్కారంలో ఎదురవుతున్న ఇబ్బందులు, తదితర అంశాలపై సచివాలయంలో కలెక్టర్లు, రిజిస్ట్రార్లతో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాల కలెక్టర్లు, జిల్లాల రిజిస్ట్రార్లు ఈ సమీక్షలో పాల్గొన్నారు.