వైరల్ న్యూస్

చెత్తలో పడేసిన చాక్లెట్ల కోసం ఎగబడిన జనం (వీడియో)

సోషల్ మీడియా పుణ్యమా అని ప్రపంచంలో ఏ మూల ఎక్కడ ఏం జరిగినా ఇట్టే తెలిసిపోతున్నది. కొందరు జనాలు చెత్త కుప్పలో పడేసినా చాక్లెట్ బాక్సులను ఎత్తుకెళ్లడం సంచలనంగా మారింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. అసలు వీళ్లు ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నారు? ఉచితంగా వస్తుందంటే చాలు.. ఎగబడి మరీ ఎత్తుకెళ్తారు అని కొందరు సోషల్ మీడియా వేదికగా ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. చెత్తలో పడేసిన ఎక్స్‌పైరీ చాక్లెట్ల కోసం జనం ఎగబడిన దృశ్యాలు చూసి చాలా మంది నోరెళ్లబెడుతున్నారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ కాన్పూర్‌లోని పంకి ప్రాంతంలోచోటు చేసుకుంది. కాలం చెల్లిన చాక్లెట్లను ఓ షాప్ సిబ్బంది సమీపంలోని చెత్తకుప్పలో పడేయగా.. గమనించిన ప్రజలు.. వెంటనే ఆ చాక్లెట్లు ఎత్తుకెళ్లడం కోసం క్యూ కట్టారు. చెత్తలో ఎందుకు పడేశారని ఆలోచించకుండా.. అందినకాడికి పట్టుకెళ్లారు.