తెలంగాణ
KTR: ప్రజల మూడ్ మారింది.. ఎక్కడ చూసినా 'దేఖ్ లేంగే' అంటున్నారు: కేటీఆర్
KTR: తెలంగాణలోని పల్లెపల్లెనా కాంగ్రెస్ పాలనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోందని, ఎక్కడికెళ్లినా ప్రజల నోట ఒకటే నినాదం వినిపిస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి ప్రాంతానికి చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తెలంగాణ భవన్లో కేటీఆర్ సమక్షంలో గులాబీ గూటికి చేరారు. వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించిన అనంతరం కేటీఆర్ కాంగ్రెస్ సర్కార్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.కేసీఆర్ ఎందుకు బయటకు రావడం లేదంటూ ప్రశ్నిస్తున్న కాంగ్రెస్ నేతలకు కేటీఆర్ గట్టి కౌంటర్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. "కేసీఆర్ ఎక్కడున్నాడు అని కాంగ్రెసోళ్లు అడుగుతుంటారు.. కేసీఆర్ మూడేళ్లు కనబడకపోయినా ప్రజల గుండెల్లో భద్రంగా ఉంటాడు.
