రాజకీయాలు

ఇందిరమ్మ ఇళ్లతో అప్పుల పాలవుతున్న ప్రజలు : మాజీ మంత్రి ఎర్రబెల్లి

అధికార కాంగ్రెస్ పార్టీ తీరుపై బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇందిరమ్మ ఇళ్లతో ప్రజలు అప్పుల పాలవుతున్నారని సంచలన ఆరోపణలు చేశారు. ‘ఊర్లల్లో కాంగ్రెస్ పార్టీని మెచ్చుకుంటున్నారని రేవంత్ రెడ్డి సిగ్గు లేకుండా చెప్తున్నాడని, దమ్ముంటే సెక్యూరిటీ లేకుండా నువ్వు, నీ మంత్రులు నాతో రండి’ అంటూ సవాల్ విసిరారు.ప్రజలు ఎట్ల తిడుతున్నారో చూపిస్తానని చెప్పారు. అసలు ఏం చేశావని నిన్ను ప్రజలు మెచ్చుకుంటారు? అని ప్రశ్నించారు. తమ ప్రభుత్వ హయాంలో భూమి కొనిచ్చి రూ.20 లక్షలతో ఇండ్లు కట్టించామని, మీ ఇందిరమ్మ ఇండ్ల వల్ల ప్రజలందరూ అప్పుల పాలవుతున్నారని అన్నారు. గత ఎన్నికల సమయంలో పెన్షన్ రూ.4వేలకు పెంచుతామని అన్నారని ఏమైందని అడిగారు. మహిళలకు రూ.2500 ఇస్తలేరని, విద్యార్థులకు స్కూటీలు ఇస్తామని చెప్పారని..కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ బంద్ పెట్టారని మండి పడ్డారు. తులం బంగారం ఏమైందని నిలదీశారు.