తెలంగాణ

Pensions: మహిళలకు శుభవార్త.. 16న కొత్త పెన్షన్ల స్కీమ్ ప్రారంభం- మంత్రి సీతక్క

Pensions: పెన్షన్లకు సంబంధించి మంత్రి సీతక్క మహిళలకు గుడ్ న్యూస్ చెప్పారు. వితంతు, ఒంటరి మహిళలకు కొత్తగా మంజూరైన పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల 16న ప్రారంభిస్తారని మంత్రి సీతక్క తెలిపారు. 16వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు హెలికాప్టర్ లో మంత్రులతో కలిసి సీఎం రేవంత్ మేడారం చేరుకుంటారని చెప్పారు.