తెలంగాణ

Congress : మంత్రి దామోదర ఎపిసోడ్‌పై పీసీసీ చీఫ్ ఆగ్రహం.. ఏఐసీసీకి నివేదిక!

మంత్రి దామోదర, ఎమ్మెల్యే కాంతారావు మధ్య నెలకొన్న వివాదంపై తేల్చేందుకు పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ రంగంలోకి దిగారు. ఈ ఘటనపై విచారణ జరిపేందుకు గాంధీభవన్ రావాలని మంత్రి దామోదర రాజనరసింహ, ఎమ్మెల్యే లక్ష్మికాంతరావుకు మొన్నసాయంత్రం నోటీసులు పంపారు. అయితే, నిన్న ఉదయం 10.30 గంటలకు విచారణకు రావాల్సి ఉండగా మంత్రి దామోదర రాలేదు. మధ్యాహ్నం 2 గంటలకు ఎమ్మెల్యే కాంతారావు విచారణ ఉండగా.. మంత్రి రాలేదని ఆయన కూడా హ్యాండ్ ఇచ్చినట్టు తెలిసింది. విచారణకు రాకుండా హ్యాండ్ ఇచ్చిన వ్యవహారంపై టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ సీరియస్‌గా ఉన్నట్టు తెలుస్తోంది.ఈ క్రమంలోనే పార్టీ సీడబ్ల్యూసీ శాశ్వత మెంబర్, మంత్రి దామోదర రాజనరసింహ, నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యే లక్ష్మికాంతారావు వ్యవహార శైలిపై కాంగ్రెస్ అధిష్టానానికి సమగ్ర నివేదికను పంపేందుకు పీసీసీ చీఫ్ సిద్దమైనట్టు తెలుస్తోంది.