రాజకీయాలు

రేవంత్‌కు షాకిచ్చిన పీసీసీ చీఫ్.. ‘రేవూరి’ అభ్యర్థిత్వ ప్రకటన చెల్లదు

వచ్చే ఎన్నికల్లో పరకాల నియోజకవర్గం నుంచి రేవూరి ప్రకాశ్ రెడ్డి నిలబడతారని సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలపై తాజాగా టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ స్పందించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘ఎమ్మెల్యే అభ్యర్థిని సీఎం రేవంత్ రెడ్డే కాదు.. ఎవరూ ప్రకటించినా చెల్లదు’ అని కుండబద్ధలు కొట్టారు. ఎమ్మెల్యేల అభ్యర్థులను నిర్ణయించేది కాంగ్రెస్ అధిష్టానం మాత్రమే అని అన్నారు. ఓ ఎమ్మెల్యే అభ్యర్థిని ఎంపిక చేయాలంటే.. స్టేట్ ఎలక్షన్ కమిటీ, ఆ తర్వాత ఢిల్లీలోని సెంట్రల్ ఎలక్షన్ కమిటీ, చివరగా సీడబ్ల్యూసీ చేతిలో నిర్ణయం ఉంటుందన్నారు. ఎవరికి వారు ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించుకుంటే చెల్లదని టీపీసీసీ చీఫ్ స్పష్టంచేశారు.