సినిమా

Pawan Kalyan-Ram Charan: నవంబర్ నుంచి సెట్స్‌పైకి పవర్ స్టార్-మెగా పవర్ స్టార్!

Pawan Kalyan-Ram Charan: సెప్టెంబర్ లో పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భగా 'ఓజీ 2' షూటింగ్ అప్‌డేట్ ఉండబోతోంది. అయితే, ఫిల్మ్ సర్కిల్స్ నుంచి వినిపిస్తున్నదాని ప్రకారం నవంబర్ నుంచి 'ఓజీ 2' షూటింగ్ మొదలవనుందట. నవంబర్‌లో ఒక్క 'ఓజీ 2' మాత్రమే కాకుండా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించబోతున్న 'ఆర్సీ 17' కూడా ఘనంగా పూజా కార్యక్రమాలతో మొదలై, వెంటనే చిత్రీకరణ కూడా ప్రారంభించేందుకు సుకుమార్ అండ్ టీమ్ రెడీ అవుతున్నట్టుగా తెలుస్తోంది.