తెలంగాణ
విద్యార్థుల మృతి కేసులో కీలక పరిణామం.. శిరీష మెమోరియల్ ట్రస్ట్ వార్డెన్ అరెస్ట్!..
పటాన్చెరు మండలం పెద్ద కంజర్లలో ఆరుగురు విద్యార్థుల మృతి తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. బుధవారం వినాయక నిమజ్జనానికి వెళ్లిన ఆరుగురు విద్యార్థులు నేరేడు చెరువులో పడి ప్రాణాలు కోల్పోయారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. శిరీష మెమోరియల్ ట్రస్ట్ వార్డెన్ జయప్రకాశ్ను అరెస్ట్ చేశారు. మరోవైపు పటాన్చెరు ఏరియా ఆస్పత్రి వద్ద మృతుల కుటుంబాలు ఆందోళనకు దిగాయి. న్యాయం జరిగే వరకు మృతదేహాలను తీసుకోబోమని స్పష్టం చేశాయి. ప్రభుత్వం ఒక్కో కుటుంబానికి రెండు లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించగా.. రెండు కుటుంబాలు చెక్కులు తీసుకునేందుకు నిరాకరించాయి.
