వైరల్ న్యూస్
మూడేళ్లుగా చిల్లర దాచి.. రూ.10నాణేలతో డ్రీమ్ బైక్ కొన్న పాస్టర్!
క్రమశిక్షణతో కూడిన చిన్న పొదుపుతో కూడా పెద్ద కలలను నెరవేర్చుకోవచ్చని నిరూపించారు మంచిర్యాల జిల్లాకు చెందిన ఒక వ్యక్తి. లక్షెట్టిపేట మండల కేంద్రానికి చెందిన పాస్టర్ రవి జోసెఫ్ గత మూడేళ్లుగా ఎంతో కష్టపడి దాచుకున్న రూ.10నాణేలతో ఏకంగా రూ.1.23లక్షల విలువైన నూతన ద్విచక్ర వాహనాన్ని కొనుగోలు చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. పాస్టర్ రవి జోసెఫ్ తనకు వచ్చిన రూ.10 నాణేలను ఖర్చు చేయకుండా ప్రత్యేకంగా దాచుకోవడం ప్రారంభించారు.
