తెలంగాణ
ఇండిగో విమానంలో ప్రయాణికుడి వీరంగం.. ఎమర్జెన్సీ డోర్ తెరిచేందుకు యత్నం!
హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (ఆర్జీఐఏ) నుంచి కడపకు బయలుదేరాల్సిన ఇండిగో విమానంలో ఓ వ్యక్తి వీరంగం సృష్టించాడు. విమానం టేకాఫ్ కాబోతున్న సమయంలో హఠాత్తుగా తన సీటు నుంచి లేచి అత్యవసర ద్వారాన్ని (ఎమర్జెన్సీ డోర్) తెరిచేందుకు ఆ ప్రయాణికుడు తెగబడ్డాడు. రన్‌వేపై సాంకేతికంగా అత్యవసరమైన ఈ సమయంలో సదరు వ్యక్తి చేసిన ప్రమాదకర చేష్టతో తోటి ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
