Parliament Session: పార్లమెంట్ ఇంకా నడుస్తూనే ఉందా? తెరపైకి ‘ఆర్టికల్ 85(1)’ పవర్..
Parliament Session: సాధారణంగా పార్లమెంట్ సమావేశాలను ఉభయ సభాపతులు నిరవధికంగా వాయిదా వేసిన రెండు, మూడు రోజుల్లోనే రాష్ట్రపతి భవన్ నుంచి ‘ప్రోరోగ్’ (సమావేశాల ముగింపు) నోటిఫికేషన్ విడుదలవుతుంది. కానీ, ఈసారి ఢిల్లీ వేదికగా దేశ పార్లమెంటరీ చరిత్రలోనే ఎన్నడూ చూడని విచిత్ర పరిణామం తెరపైకి వచ్చింది. వర్షాకాల సమావేశాలు ఆగస్టు 13న నిరవధికంగా వాయిదా పడి దాదాపు మూడు నెలలు గడిచినా, ఇంతవరకు రాష్ట్రపతి నుంచి ముగింపు ప్రకటన వెలువడలేదు. ఫలితంగా గత 89 రోజులుగా పార్లమెంట్ అధికారికంగా ముగియకుండా కొనసాగుతూనే ఉందన్న వార్త దేశ రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ రేపుతోంది.గతంలో 2008లో నాటి యూపీఏ ప్రభుత్వంపై వచ్చిన అవిశ్వాస తీర్మానంపై చర్చించేందుకు జూలై 21, 22 తేదీల్లో లోక్సభ సమావేశమైంది. ఆ తర్వాత సభ నిరవధికంగా వాయిదా పడినప్పటికీ, ప్రోరోగ్ కాకుండా ఏకంగా 87 రోజుల పాటు కొనసాగిన రికార్డు నమోదైంది.
