క్రైమ్

పార్కింగ్ గొడవ.. తుపాకీతో 15 నుంచి 16 రౌండ్ల కాల్పులు

ఫరీదాబాద్ సెక్టార్‌ 21సీలో కారు పార్కింగ్ వివాదం కారణంగా పొరుగింటి వ్యక్తి తుపాకీతో కాల్పులు జరపడంతో పరంజీత్ ధన్‌ఖడ్ (42) అనే ఎన్నారై దారుణ హత్యకు గురయ్యారు. సింగపూర్‌లో నివసిస్తున్న టెక్ మహీంద్రా మాజీ ఉన్నతోద్యోగి పరంజీత్.. తన మేనల్లుడి వివాహం కోసం భారత్‌కు వచ్చాడు. తాను నివసించే అపార్ట్‌మెంట్‌లో పార్కింగ్ విషయంలో గొడవ కాస్త అతని హత్యకు దారితీయడంతో అంతా షాక్‌కు గురయ్యారు. అయితే, సింగపూర్‌లో పనిచేస్తున్న పరంజీత్ ధన్‌ఖడ్ ఫరీదాబాద్‌లోని ఒక అపార్ట్‌మెంట్ మొదటి అంతస్తులో నివసిస్తున్నాడు.అదే భవనం మూడో అంతస్తులో మోహన్ (మోనూ) శర్మ ఉంటున్నాడు.తనకు కేటాయించిన స్థలంలో కారు పార్కింగ్ చేసిన విషయంపై పరంజీత్, మోనూ శర్మ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.గతంలోనూ వీరిద్దరి మధ్య పార్కింగ్ సహా ఇతర చిన్న విషయాలపై తరచూ గొడవలు జరిగేవని సమాచారం.