International

ముస్లిం సిటీగా మారనున్న ‘పారిస్’.. ట్రంప్ సంచలన కామెంట్స్

ఫ్రాన్స్‌లో చెలరేగిన అల్లర్లపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. వాషింగ్టన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఫ్రాన్స్‌లో జరుగుతున్న ఆందోళనలకు పాఠశాలల సమస్యలు, లేదా ఇతర కారణాలు కాదని, కేవలం వలసలే ప్రధాన కారణమని స్పష్టంచేశారు. తాను పలుమార్లు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌తో మాట్లాడానని చెప్పారు. వలసవాదులను విపరీతంగా ప్రోత్సహిస్తూ ఫ్రాన్స్ తప్పు చేస్తోందని ఇప్పటికే చెప్పానని గుర్తుచేశారు. ప్రపంచం మొత్తం ఫ్రాన్స్‌కే వస్తోందని, అలా చేయడం సరికాదని హెచ్చరించినట్టు గుర్తుచేశారు.యూరప్, ఫ్రాన్స్ దేశాల అధ్యక్షులు వెంటనే తమ దేశాల సరిహద్దులను మూసివేయాలని సూచించారు. మితిమీరిన వలసదారుల వల్లే అక్కడ అల్లర్లు చెలరేగుతున్నాయని ట్రంప్ ఆరోపించారు. ఐరోపా ఇప్పటికైనా సరిహద్దులను మూసివేసి నిరసనలు చేస్తున్న వారిలో నేరస్థులను గుర్తించకపోతే యూరప్ మొత్తం నాశనమైపోతుందని పునరుద్ఘాటించారు.