తెలంగాణ

గెంటేసిన కొడుకు.. న్యాయం చేయాలని తల్లిదండ్రుల నిరసన

పున్నామా నరకం నుంచి రక్షించేవాడిని కొడుకు అంటారని నానుడి ఉంది.కానీ, నేడు ఆ తనయులే తల్లిదండ్రులను వీధుల్లోకి లాగుతున్నారు. ఆస్తిపాస్తుల కోసం, భార్య చెప్పిందని, సంతానం కోసం పేరెంట్స్‌ను నిర్లక్ష్యం చేస్తున్నారు.వారిని పట్టించుకోకుండా తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారు.డబ్బులు ఇవ్వడం లేదని, ఆస్తి పేరిట రాయడం లేదని వారిని దూషించడం, దాడులు చేయడం వంటివి చేస్తున్నారు. వారికి తిండి పెట్టకుండా నరకయాతనకు గురిచేస్తున్నారు. ఇలాంటి ఘటనలు ప్రస్తుత రోజుల్లో అనేకం వెలుగుచూస్తున్నాయి. తాజాగా ఇలాంటి ఘటనే మరొకటి వెలుగుచూసింది. కన్నకొడుకు ఇంటి నుండి గెంటివేశాడనని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్లెక్సీ ఏర్పాటు చేసి మరి తనయుడి ఇంటి ముందు ధర్నాకు దిగారు. ఈ ఘటన మియాపూర్‌లోని ఇంద్రారెడ్డి అల్విన్ కాలనీలో బుధవారం ఉదయం చోటుచేసుకుంది.