National

paper leak : జార్ఖండ్‌లో హై టెన్షన్.. సీఎం సోరెన్ ఇంటి ముట్టడికి యత్నం!

జార్ఖండ్‌లో ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో పేపర్ లీకేజీలపై అక్కడి విద్యార్థులు, అభ్యర్థులు ఒక్కసారిగా ఆగ్రహించారు. పేపర్ లీకేజీకి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించడంతో పాటు ఆ నియామకాలు రద్దు చేసి కొత్తగా పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు చేపట్టిన నిరసనప్రదర్శనలు శాంతియుతంగా కొనసాగుతున్నాయి. రెండ్రోజుల కిందట జార్ఖండ్ రాజధాని రాంచీలో విద్యార్థుల ఆందోళన తీవ్రరూపం దాల్చింది. పలు విద్యార్థి సంఘాల నాయకత్వంలో వేలాది మంది విద్యార్థులు పోలీసు బారికేడ్లను తొసుకుని అసెంబ్లీ ముట్టడికి యత్నించారు. పలు జిల్లాల నుంచి వేలాది మంది విద్యార్థులు రైళ్లు, బస్సులు, సొంత వాహనాల్లో ఉదయం రాంచీకి చేరుకున్న విద్యార్థులు తమ డిమాండ్లను ప్రభుత్వం విని, తగిన సమాధానం చెప్పాలని డిమాడ్ చేశారు. ఇదిలాఉండగా, సోమవారం ఉదయం సీఎం హేమంత్ సోరెన్ నివాసాన్ని విద్యార్థులు ముట్టడికి యత్నించారు.