National
Palghar Hospital Attack: ఐసీయూలోకి చొరబడి.. డాక్టర్లపై శివసేన నాయకుల దాడి
మహారాష్ట్రలో ఒక సంచలన ఘటన చోటుచేసుకుంది. శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఆదివారం తెల్లవారుజామున పాల్ఘర్లోని రిలీఫ్ ఆస్పత్రిలో వైద్యులు, సిబ్బందిపై శివసేన కార్యకర్తలు దాడికి పాల్పడినట్లు సమాచారం. ఈ ఘటనలో జోక్యం చేసుకునేందుకు ప్రయత్నించిన రిసెప్షనిస్ట్‌పై ఓ కార్యకర్త చెంపదెబ్బ కొట్టినట్లు, మరో మహిళా ఉద్యోగిని బెదిరించినట్లు తెలుస్తోంది. జన్మాష్టమి సందర్భంగా నిర్వహించిన ‘దహీ హండి’ కార్యక్రమంలో పాల్గొని గాయపడిన గోవిందాలకు చికిత్స అందించిన అనంతరం బిల్లు విషయంలో వివాదం తలెత్తినట్లు సమాచారం.
ఆస్పత్రి ఉద్యోగి కుందన్ సాంకే పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం.. శివసేన జిల్లా అధ్యక్షుడు, నగర అధ్యక్షుడు రాహుల్ ఘరాట్ తదితరులు ఐసీయూలోకి అత్యవసర ప్రవేశించి వైద్యులతో వాగ్వాదానికి దిగినట్లు తెలిపారు.
