తెలంగాణ
సమస్యల పరిష్కారమే లక్ష్యంగా.. రేపటి నుండి మండల స్థాయిలో ప్రజావాణి!..
సమస్యల పరిష్కారం కోసం కలెక్టర్ ఆఫీసుకు వెళ్ళకుండా ఈ నెల 17వ తేదీ నుంచి మండల స్థాయిలోనూ ప్రజావాణి కార్యక్రమం ప్రారంభం కానుంది. ప్రతి సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మండల పరిషత్ కార్యాలయాల్లో ప్రజావాణి నిర్వహిస్తారు. ఎంపీడీవోలు నోడల్ అధికారులుగా, అన్ని శాఖల మండల అధికారులు ఇందులో పాల్గొంటారు. ప్రజలు తమ సమస్యలపై నేరుగా ఆర్జీలు సమర్పించవచ్చు. ఫిర్యాదులను సంబంధిత అధికారులు నిర్ణీత సమయంలో పరిష్కరించనున్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్లు సూచించారు.
