తెలంగాణ

TG: పాలమూరు రైతులను ఎండబెట్టి ఏపీకి నీళ్లా.. సీఎం రేవంత్‌పై హరీశ్ రావు ఫైర్

TG: తెలంగాణలో తీవ్రమవుతున్న సాగునీటి కొరత, కరువు పరిస్థితులపై బీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి టి.హరీశ్ రావు కాంగ్రెస్ పాలనపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో నెలకొన్న దుస్థితి ప్రకృతి వైపరీత్యం వల్ల వచ్చింది కాదని, రేవంత్ రెడ్డి అసమర్థ పరిపాలన ఫలితంగా తలెత్తిన మానవ తప్పిదమేనని స్పష్టం చేశారు. నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్‌లతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.శ్రీశైలం జలాశయంలో తగినంత నీరు నిల్వ ఉన్నప్పటికీ తెలంగాణ ఆయకట్టుకు ఎందుకు విడుదల చేయడం లేదని హరీశ్ రావు ప్రశ్నించారు.