ప్రపంచం
భారత్‌ను మరోసారి హెచ్చరించిన పాకిస్తాన్ ప్రధాని..
భారత్‌ను పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ మరోసారి హెచ్చరించారు. సింధు నదీ జలాల విషయంలో భారత్ తన పంతం మానుకోవాలని లేదంటే పాకిస్తాన్ నేరుగా స్పందిస్తుందని కామెంట్స్ చేశారు. ప్రస్తుతం పాక్ ప్రధాని చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.కానీ, పాక్ ప్రధాని వ్యాఖ్యలను భారత ప్రభుత్వం పెద్దగా పట్టించుకోలేదని సమాచారం. పాాకిస్తాన్లోకి వెళ్లే సింధు నదీ జలాలను భారత్ నిలిపివేసింది. దీంతో పాక్‌లో తాగు, సాగు నీటి సమస్య ఏర్పడింది. ఈ క్రమంలోనే పాక్ ప్రధాని ఇప్పటికే పలుమార్లు మేకపోతు గంభీర్యం ప్రదర్శిస్తూ భారత్‌ను హెచ్చరించే ప్రయత్నం చేశారు. తాజాగా ఇస్లామాబాద్‌లో యాద్గార్-ఎ-ఫతా స్మారకాన్ని ప్రారంభించిన సందర్భంగా షెహబాజ్.. భారత్‌ను హెచ్చరించే ప్రయత్నం చేశారు.
