తెలంగాణ
హైకోర్టు తీర్పు కాంగ్రెస్ పార్టీకి, సీఎం రేవంత్‌కి చెంపదెబ్బ
Padi Kaushik Reddy: ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కు హైకోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. దానం నాగేందర్ శాసనసభ సభ్యత్వంపై హైకోర్టు అనర్హత వేటు వేసింది. పార్టీ ఫిరాయింపు అంశంలో ఈ మేరకు న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించింది. దీనిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి స్పందించారు. హైకోర్టు తీర్పు కాంగ్రెస్ పార్టీకి, సీఎం రేవంత్ కి చెంపదెబ్బ అని చెప్పారు. అమ్ముడుపోతే అనర్హత తప్పదని మేము గతంలోనే చెప్పామన్నారు. మిగిలిన 8మందిపైనా అనర్హత వేటు పడే వరకు పోరాటం కొనసాగిస్తామని పాడి కౌశిక్ రెడ్డి తెలిపారు. అధికారం ఉందని విర్రవీగితే ఎదురుదెబ్బలు తప్పవన్నారు. ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగే ఉపఎన్నికలో బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగురవేస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
