National
యూపీలో ఓవైసీ నయా పాలిటిక్స్.. కొత్త కూటమి సీఎం అభ్యర్థిగా ‘ఆజాద్’..
యూపీలో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి.వచ్చే ఏడాది ప్రారంభంలో ఉత్తరప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కీలక ప్రకటన చేశారు. కొత్తగా ఏర్పాటు చేసిన ‘సామాజిక పరివర్తన మోర్చా’ (SPM) తరఫున యూపీ సీఎం అభ్యర్థిగా ఆజాద్ సమాజ్ పార్టీ (కాన్షీరామ్) అధ్యక్షుడు చంద్రశేఖర్ ఆజాద్‌ను అధికారికంగా ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే గురువారం యూపీ రాజధాని లక్నోలో చంద్రశేఖర్ ఆజాద్‌తో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు.యూపీలో బీజేపీ మూడోసారి అధికారంలోకి రాకుండా అడ్డుకోవడమే తమ కూటమి ప్రధాన లక్ష్యమని వెల్లడించారు. ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ మాట్లాడుతూ.. యూపీలో బీజేపీ హ్యాట్రిక్ విజయం సాధించకుండా అడ్డుకోవడానికి తమ కూటమి ఓ బలమైన ప్రత్యామ్నాయంగా నిలుస్తుందని పూర్తి విశ్వాసంతో చెబుతున్నానని అన్నారు.
