సినిమా
1400 పైగా చిత్రాలు.. రమాప్రభ జీవిత విశేషాలతో ‘ఇదేనండి నా కథ'!
ప్రముఖ సీనియర్ నటి రమాప్రభ జీవిత ప్రయాణం పుస్తక రూపంలోకి వచ్చింది. 'ఇదేనండి నా కథ' పేరుతో రూపుదిద్దుకున్న ఈ ఆత్మకథా శైలి పుస్తకాన్ని ఆమె 81వ పుట్టినరోజు సందర్భంగా మదనపల్లెలో ఘనంగా ఆవిష్కరించారు. అన్నమయ్య జిల్లా మదనపల్లె మండలంలోని బసినకొండ పంచాయతీ, గంగన్నగారిపల్లెలో ఉన్న రమాప్రభ నివాసంలో స్థానిక ప్రముఖులు, అభిమానుల మధ్య ఈ వేడుకను నిర్వహించారు. గత కొంతకాలంగా వెండితెరకు దూరంగా ఉంటూ రమాప్రభ ఆధ్యాత్మిక చింతనతో ప్రశాంత జీవనం గడుపుతున్నారు.
