టాప్ న్యూస్
మిగిలింది రెండేండ్లే.. ‘నామినేటెడ్’ ఊరించుడు ఇంకెన్నాళ్లు?
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి రావాలంటే ముందుగా అసంతృప్తితో ఉన్న నేతలకు పదవులు ఇవ్వాలని, దక్కని వారికి మరోవిధంగా బుజ్జగింపులు, హామీలు ఇవ్వాలని అధిష్టానం సైతం ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది.కేవలం రెండేండ్లే సమయం ఉండటంతో త్వరగా నామినేటెడ్ పోస్టులు భర్తీ చేయాలని చూస్తున్నట్టు సమాచారం. పదవులు పొందిన నేతలను పార్టీ కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేసేలా క్యాలెండర్ తయారు చేస్తున్నట్టు తెలిసింది.ఈ క్రమంలోనే ఒకేసారి దాదాపు 60 కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్లను నియమించనున్నట్టు తెలిసింది. ఈ లెక్కన సుమారు 200 మందికి పదవులు వస్తాయని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే సమర్థులైన నేతల పేర్లను సీఎం రేవంత్, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ ఫైనల్ చేసినట్టు సమాచారం.
