International

Online Hate: యూఎస్‌లో మనోళ్లపై 240% పెరిగిన హేట్రెడ్! జాబ్స్ లాక్కుంటున్నారంటూ టార్గెట్..

Online Hate: అమెరికన్ డ్రీమ్ వెనుక ఇప్పుడు తీవ్ర అభద్రత, ఆందోళన అలముకుంటున్నాయి. దశాబ్దాలుగా సిలికాన్ వ్యాలీ నుంచి వాల్‌స్ట్రీట్ వరకు అమెరికా ప్రగతి రథాన్ని నడిపిస్తున్న భారతీయ నిపుణులు ఇప్పుడు తీవ్రమైన ఆన్‌లైన్ హేట్రెడ్‌ను ఎదుర్కొంటున్నారు. "మా ఉద్యోగాలు లాక్కుంటున్నారు" అనే తప్పుడు ప్రచారంతో కొందరు టార్గెట్ చేస్తుండటం ప్రస్తుతం యూఎస్‌లో పెను దుమారం రేపుతోంది.వాషింగ్టన్ కేంద్రంగా పనిచేసే ‘సెంటర్ ఫర్ ది స్టడీ ఆఫ్ ఆర్గనైజ్డ్ హేట్’ తాజా పరిశోధనలో చేదు నిజాలు వెలుగుచూశాయి. ప్రముఖ సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’లో దక్షిణాసియా నిపుణులను టార్గెట్ చేసుకుని వస్తున్న ద్వేషపూరిత పోస్టులు రికార్డు స్థాయిలో 240 శాతం పెరిగాయి.

గతంలో నెలకు సగటున 12,904గా ఉన్న ఇలాంటి పోస్టులు, క్రమంగా పెరుగుతూ నెలకు ఏకంగా 43,843 మార్కును తాకాయి.