తెలంగాణ

‘వన్ వే’ శాశ్వతం.. కేబీఆర్ పార్క్ చుట్టూ ఫ్లైఓవర్ల ప్రాజెక్ట్ రద్దు!

హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ కేబీఆర్ పార్క్ (KBR Park) చుట్టూ ప్రతిపాదించిన బహుళ ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌ల నిర్మాణ ప్రణాళికలో ప్రభుత్వం, రవాణా అధికారులు కీలక మార్పులు చేశారు. ఇటీవల ట్రాఫిక్ నివారణ కోసం ప్రయోగాత్మకంగా అమలు చేసిన 'వన్‌వే' (One-way) విధానం ఊహించని రీతిలో అద్భుత ఫలితాలనివ్వడంతో పాత ప్రాజెక్టును ఉపసంహరించుకోవాలని భావిస్తున్నారు. ప్రాజెక్టు వ్యయం , భూసేకరణ భారాన్ని తగ్గించుకోవడంలో భాగంగా కేబీఆర్ పార్క్ చుట్టూ నిర్మించతలపెట్టిన రూ.1,090 కోట్ల విలువైన పలు ఫ్లైఓవర్ల ఫ్లష్ ప్లాన్‌ను రద్దు చేయాలని అధికారులు నిర్ణయించారు.