క్రైమ్

ఒకరు బైక్, మరొకరు బర్త్ డే కోసం.. ఫ్రెండ్‌ను కడతేర్చిన మైనర్లు!

చిన్నచిన్న సరదాల కోసం మైనర్లు తప్పు దారి పడుతున్నారు. చెడు సహవాసమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. తప్పుడు దారిలో వెళ్తున్న కొందరు మరికొందరిని నేరాల వైపు ప్రేరేపిస్తున్నట్టు సమాచారం. బుద్ధిగా చదువుకోవాల్సిన వయసులో ఇద్దరు మైనర్లు ఏకంగా తన మిత్రుడినే మర్డర్ చేశారు.అనంతరం పోలీసుల నుంచి తప్పించుకోవడానికి సినిమా లెవల్లో ప్లాన్స్ రెడీ చేయడంతో పాటు దానిని ఫాలో అయ్యారు. తాజాగా ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.

వివరాల్లోకివెళితే.. మహారాష్ట్రలో 17 ఏళ్ల ప్రజ్యోత్ కాంబ్లే అనే బాలుడు సెప్టెంబర్ 24న సాయంత్రం అదృశ్యమయ్యాడు. అతని కోసం ఎంత వెతికినా ఆచూకీ లభ్యం కాలేదు. దీంతో బాలుడి పేరెంట్స్ పోలీసులను ఆశ్రయించారు.మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.విచారణలో భాగంగా వారికి షాకింగ్ నిజాలు తెలిశాయి. కనిపించకుండా పోయిన బాలుడు హత్యకు గురయ్యాడని, నేరానికి పాల్పడింది అతని మిత్రులే అని గుర్తించారు. వారు కూడా మైనర్లే అని తేలింది.