Oman Coast: ఒమన్ తీరంలో వాణిజ్య నౌకపై మిస్సైల్ దాడి.. 11 మంది ఇండియన్స్‌కి గాయాలు!
Oman Coast: ఒమన్ సమీపంలోని హర్మూజ్ జలసంధిలో పనామా ఫ్లాగ్‌తో వెళ్తున్న ఓ కార్గో షిప్‌ను గుర్తుతెలియని దుండగులు టార్గెట్ చేశారు. ఈ దాడిలో షిప్లో పనిచేస్తున్న 11 మంది భారతీయ క్రూ మెంబర్స్ తీవ్రంగా గాయపడ్డారు. ఈ సమాచారాన్ని న్యూఢిల్లీలోని భారత విదేశాంగ శాఖ (MEA) అధికారికంగా కన్ఫర్మ్ చేసింది.దాడి జరిగిన వెంటనే సమాచారం అందుకున్న ఒమన్ మారిటైమ్ అథారిటీస్, కోస్ట్‌గార్డ్ టీమ్స్ రంగంలోకి దిగాయి. ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఇండియన్ క్రూ మెంబర్స్‌ను షిప్ నుంచి సేఫ్‌గా ఒడ్డుకు తీసుకొచ్చారు. ప్రస్తుతం లోకల్ హాస్పిటల్స్‌లో వారికి ఎమర్జెన్సీ మెడికల్ ట్రీట్మెంట్ అందిస్తున్నారు. టైంకి రియాక్ట్ అయ్యి మనవాళ్ల ప్రాణాలు నిలబెట్టిన ఒమన్ సర్కారుకు కేంద్ర ప్రభుత్వం థాంక్స్ చెప్పింది. బాధితులకు అవసరమైన అన్ని రకాల సహాయాన్ని మస్కట్‌లోని ఇండియన్ ఎంబసీ అధికారులు పర్యవేక్షిస్తున్నారు.
