వామ్మో పెద్దపులి.. డప్పు చాటింపులు, మైకుల్లో హెచ్చరికలు!
రాష్ట్రంలో మరోసారి అలజడి నెలకొంది. ఉత్తర తెలంగాణలో మరోసారి పెద్దపులి సంచారం అక్కడి ప్రజలు, రైతులను నిద్రలేకుండా చేస్తున్నది.రాత్రిళ్లు బయటకు వెళ్లాలంటేనే జనాలు జంకుతున్నారు. పశువులు, చిన్న పిల్లలను కాపాడుకునేందుకు రాత్రిబవళ్లు కంటిమీద కునుకు లేకుండా కాపలా కాస్తున్నట్టు సమాచారం.ఫారెస్టు అధికారులు సైతం అడుగు జాడలను గుర్తించడంతో పులి సంచారం ప్రస్తుతం హాట్ టాపిక్ అయ్యింది. దీంతో కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో హై అలర్ట్ ప్రకటించినట్టు సమాచారం. కౌటాల, సిర్పూర్, చింతలమానేపల్లి మండలాల్లో పెద్దపులి సంచరించినట్టు స్థానిక రైతులు గుర్తించి ఫారెస్టు అధికారులకు సమాచారం అందించినట్టు తెలిసింది. ఆడేపల్లి, శీర్ష గ్రామాల సమీపంలోని పంట పొలాల్లో పులి పాదముద్రలు కలకలం రేపడంతో అధికారులు అక్కడకు చేరుకుని పరిశీలించగా.. నిజంగానే అవి పెద్దపులి పాదముద్రలుగా నిర్దారించారు
