ఏపీ
హద్దు మీరిన అధికారులు.. త్రివర్ణపతాకం ముందే నీచమైన డ్యాన్సులు!
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కొందరు జాతీయ జెండాను అవమానపరిచే విధంగా వ్యవహారించారని సోషల్ మీడియాలో పెద్దఎత్తున విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. కొన్ని చోట్ల త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించే క్రమంలో తప్పులు దొర్లడం, మరికొందరు జతీయగీతం ఆలాపన సందర్భంగా కనీస మర్యాద పాటించకుండా వ్యహరించారని, కేవలం మౌనంగా నిలబడ్డారని, ఆలాపించడం లేదని విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఈ క్రమంలోనే ఏపీలోని అల్లూరి జిల్లా చింతపల్లిలోని APFDC కార్యాలయంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో అధికారులు వింతగా ప్రవర్తించారు. జాతీయ జెండా ఎగురవేసిన అనంతరం దేశభక్తి గీతాలకు బదులుగా ‘రాను బొంబాయికి రాను’ వంటి సినిమా, జానపద పాటలకు అధికారులు స్టెప్పులు వేశారు. మువ్వన్నెల జెండా నీడన వినోద నృత్యాలు చేయడంపై స్థానికులు, నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
