సినిమా
Official: ధనుష్, మమ్ముట్టి ‘ఓం’ రిలీజ్ డేట్ లాక్.. నవంబర్లో భారీ యాక్షన్ ట్రీట్!
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి కలిసి నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘ఓం: చాప్టర్ 1’ రిలీజ్ డేట్ ఎట్టకేలకు లాక్ అయింది. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొనగా.. తాజాగా మేకర్స్ కొత్త విడుదల తేదీని అధికారికంగా ప్రకటించారు. నవంబర్ 20, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో ‘ఓం’ విడుదల కానుంది. తాజాగా, ఈ విషయాన్ని తెలుపుతూ కొత్త పోస్టర్ను విడుదల చేశారు.
