సినిమా
Official: "జైలర్ 2" రిలీజ్ డేట్ కన్ఫర్మ్..అక్టోబర్ 15న విధ్వంశమే
Official: సూపర్ స్టార్ రజినీకాంత్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా 'జైలర్ 2'. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని (అక్టోబర్ 15) మేకర్స్ అధికారికంగా కన్ఫర్మ్ చేశారు. ఈ సినిమాకి నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. 2023లో రజినీ-నెల్సన్ కాంబోలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ 'జైలర్' కి సీక్వెల్ గా రూపొందుతోంది. అయితే, ఈ మధ్య ఈ సినిమాకి సంబందించి ఆశించిన అప్డేట్స్ రాకపోవడంతో విడుదల వాయిదా పడిందని వార్తలు ప్రసారం కాగా, వాటికి మేకర్స్ (సన్ పిక్చర్స్) చెక్ పెట్టారు.
