National
ఏజెన్సీలో ఆగని గిరిజనుల అవస్థలు.. ప్రాణాల కోసం తప్పని పరుగులు!!..
సుంకి గ్రామపంచాయతీకి చెందిన జంకర్గుడ గ్రామంలో సావిత్రి అనే మహిళ గత కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతోంది. ఆదివారం ఉదయం పరిస్థితి ఆందోళనగా మారింది. అయితే ఆ గ్రామానికి అంబులెన్స్ రాలేని దుస్థితి. దీంతో బంధువులు, గ్రామస్థులు ఆమెను డోలీలో 10 కిలోమీటర్లు మోసుకుంటూ ప్రధాన రహదారిపైకి తీసుకొచ్చారు. అక్కడి నుంచి ఓ ఆటోలో ఆంధ్రాలో ఉన్న సాలూరు ప్రభుత్వ ఆరోగ్య కేంద్రానికి తరలించారు. సరైన రహదారి లేకపోవడంతో అత్యవసర పరిస్థితుల్లో ఇలాంటి నరకాన్ని అనుభవిస్తున్నట్లు గ్రామస్థులు తెలిపారు.
