National
Agriculture Business: 2 రూపాయాల ఐడియాతో మొదలైన ప్రయాణం.. 500 కుటుంబాల తలరాత మార్చిన రైతు!
Agriculture Business: లక్షల రూపాయల పెట్టుబడి ఉంటేనే పెద్ద వ్యాపారం చేయగలమని చాలామంది అనుకుంటారు. కానీ, సరైన ఆలోచన, పట్టుదల ఉంటే కేవలం రెండు రూపాయల ఐడియాతో కూడా కోట్ల రూపాయల సామ్రాజ్యాన్ని నిర్మించవచ్చని నిరూపించాడు ఓ సామాన్య రైతు. ఒడిశాలోని అంగుల్ జిల్లాకు చెందిన సంతోష్ సాహు, ఒక చిన్న నిమ్మతోట ప్రయోగాన్ని ఏకంగా అమెరికా, యూకే వరకు ఎగుమతి చేసే ఇంటర్నేషనల్ బిజినెస్‌గా మార్చాడు. తాను ఏడాదికి రూ. కోటికి పైగా టర్నోవర్ సాధించడమే కాకుండా, తన చుట్టుపక్కల ఉన్న 500 రైతు కుటుంబాల తలరాతను మార్చి అందరికీ ఆదర్శంగా నిలిచాడు.
