వైరల్ న్యూస్

రీల్స్ పిచ్చి.. కొడుకు ప్రాణాలను రిస్కులో పడేసిన తల్లి!

రీల్స్ మోజులో పడిన కొందరు ప్రపంచాన్ని మైమరిచిపోతున్నారు. వ్యూస్, లైక్స్ కోసం బంధాలు, బంధుత్వాలు, వ్యక్తులను లెక్కచేయడం లేదు. రీల్స్‌లో ఫేమస్ అవ్వాలనే దానిమీద వారికి పెద్దగా ఆసక్తి ఉంటోందని నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు. చుట్టుపక్కల ఏం జరుగుతోంది? ఎక్కడ ఉన్నాం? మన చేష్టల వలన ఎవరైనా ఇబ్బంది పడతున్నారా? అనే ఆలోచన సైతం వారికి రావడం లేదని సోషల్ మీడియా వేదికగా పలువురు తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. తాజాగా ఓ మహిళ రీల్స్ మోజులో పడి తన కుమారుడి జీవితాన్ని రిస్కులో పడేసింది. ఈ దృశ్యం వీడియాలో స్పష్టంగా కనిపిస్తోంది. ఓ ఫ్లై ఓవర్ మీద రీల్ చేయడం కోసం వివాహిత తన కొడుకుని రోడ్డు మీద వదిలేసింది.