International

Nvidia CEO Resigns: సంచలనం.. ఎన్విడియా సీఈవో జెన్సన్‌ రాజీనామా.. ఎఫైర్‌ ఎంత పనిచేసింది?

Nvidia CEO Resigns: ప్రపంచ టెక్, ఏఐ రంగాన్ని శాసిస్తున్న దిగ్గజ కంపెనీ 'ఎన్విడియా'లో ఊహించని షాకింగ్ పరిణామం జరిగింది. ఆ సంస్థ సీఈవో జెన్సన్ హువాంగ్ తన పదవికి రాజీనామా చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. దశాబ్దాలుగా కంపెనీని అగ్రస్థానంలో నిలిపిన హువాంగ్, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఎఫైర్ వివాదంలో చిక్కుకుని పదవి నుంచి తప్పుకోవడం ఇప్పుడు గ్లోబల్ టెక్ ఇండస్ట్రీలో ప్రకంపనలు సృష్టిస్తోంది.గత కొద్ది రోజులుగా జెన్సన్ హువాంగ్ వ్యక్తిగత జీవితంపై సంచలన వార్తలు బయటకు వస్తున్నాయి. చైనా గూఢచారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న అలిస్ అనే మహిళతో తనకు వివాహేతర సంబంధం ఉన్నట్లు హువాంగ్ ఇటీవలే ప్రకటించడం పెద్ద దుమారం రేపింది. ఆ వివాదం ఇంకా సద్దుమణగక ముందే, తాజాగా మరో మహిళతోనూ ఆయనకు సంబంధాలు ఉన్నాయంటూ అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.