కిటికి నుంచి దూరి నర్సుపై అఘాయిత్యం.. ఆపై కిరాతకం!
రాష్ట్రంలో మరో దారుణం చోటుచేసుకుంది. నర్సు మీద ఓ దుండగుడు అత్యాచారయత్నం చేయడంతో పాటు ఆమె కిరాకతంగా హతమార్చాడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా పహాడీషరీఫ్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని తుక్కుగూడలో చోటుచేసుకుంది.నిందితుడు ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నట్టు సమాచారం. మృతురాలిని శిరీష(21) గుర్తించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ అనంతరం హత్యగా ధ్రువీకరించారు. తుక్కుగూడలోని ‘ప్రైమ్ సూపర్ స్పెషాలిటీ’ ఆసుపత్రిలో శిరీష నర్సుగా పనిచేస్తోంది. ఎప్పటిలాగే విధులు ముగించికుని వచ్చి తన గదిలో విశ్రాంతి తీసుకుంటోంది. అయితే, బిహార్‌కు చెందిన సలావుల్లా (35) స్థానికంగా ఓ బైక్ మెకానిక్ షాపులో పనిచేస్తున్నాడు. అతను పోర్న్ వీడియోలకు అడిక్ట్ అయినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే శిరీష గదిలో ఒంటరి ఉంటున్నట్టు కనిపెట్టిన అతను.. అర్ధరాత్రి కిటికి ద్వారా గదిలోకి చొరబడినట్టు సమాచారం. ఆమె మీద అత్యాచారయత్నానికి పాల్పడ్డగా..బాధితురాలు తీవ్రంగా ప్రతిఘటించింది. దీంతో ఆమె గొంతు నులిమి మరోసారి అత్యాచారం చేసేందుకు ప్రయత్నించగా విఫలం కావడంతో ఆగ్రహానికి గురైన సనావుల్లా ఆమెను సుత్తితో కొట్టి చంపినట్టు తెలిసింది.
