సినిమా

NTR: ఎన్టీఆర్‌కు శస్త్రచికిత్స విజయవంతం..హెల్త్ బులిటెన్ విడుదల..

NTR: NTR: ఎన్టీఆర్‌ కి నేడు సికింద్రాబాద్ లోని కింస్ హాస్పిటల్‌లో సర్జరీ పూర్తైంది. ఆయన నటిస్తున్న లేటెస్ట్ మూవీ షూటింగ్‌లో భుజానికి గాయమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో డాక్టర్లు పరీక్షలు నిర్వహించి సర్జరీ అవసరమని చెప్పారు. దీనికి, సంబందించి నిన్న(ఆగస్టు 11) ప్రెస్‌నోట్ ద్వారా ఆగస్టు 12న సర్జరీ చేయించుకోనున్నట్టుగా తెలిపారు. అలాగే, ఎన్టీఆర్‌కు శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తైంది. తాజాగా హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. మరో, 3 నెలలపాటు తారక్ రెస్ట్ తీసుకోవాల్సి ఉందని వెల్లడించారు.