తెలంగాణ

నేటి నుంచి ఓటర్లకు నోటీసులు.. ఇంటింటికీ బీఎల్‌వోలు!

రాష్ట్రంలోని ఓటర్లకు నోటీసులు పంపించే ప్రక్రియను ఎన్నికల సంఘం నేటి నుంచి ప్రారంభించింది. ఇటీవల నిర్వహించిన ఓటరు జాబితా సమగ్ర సవరణ(ఎస్ఐఆర్) లో భాగంగా ఎవరైతే ఎన్యూమరేషన్ ఫారమ్స్ బీఎల్‌వోల నుంచి అందుకోలేదో, అందుకున్న వారు ఎవరైతే తిరిగి అప్పగించలేదో అనగా వివరాలు అందజేయని వారికి తాజాగా ఈసీ నోటీసులు జారీ చేయనుంది. వారంతా ఆ నోటీసుల్లో ఉన్న అంశాల మేరకు వారు భారతీయులు అని ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. అందుకోసం ఆ నోటీసుల్లో పేర్కొన్న విధంగా ధ్రువపత్రాలు ఎన్నికల సంఘానికి సమర్పించాల్సి ఉంటుంది. ఈ మేరకు తెలంగాణలో నేటి నుంచి ఓటర్లకు నోటీసుల జారీ ప్రక్రియ ప్రారంభమైంది. కాగా, ఈ నెల 17వ తేదీన ఎన్నికల సంఘం ముసాయిదా ఓటర్ల జాబితాను విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే, రాష్ట్రవ్యాప్తంగా 93 లక్షల మంది ఓటర్లకు నోటీసులు ఇవ్వనున్నట్టు ఈసీ తెలిపింది.