తెలంగాణ

ఓటు చోరీ కాదు.. రాహుల్ గాంధీ బుద్ధి చోరీ : ఎంపీ అర్వింద్

దేశంలో ఓటు చోరీ జరిగిందని, కేంద్రంలోని బీజేపీ ఎన్నికల కమిషన్ సాయంతో అధికారంలోకి వస్తుందని లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేస్తున్న ఆరోపణలకు నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ తాజాగా కౌంటర్ ఇచ్చారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘దేశంలో ఓట్ చోరీ కాదు.. రాహుల్ గాంధీ అఖల్ చోరీ’ జరుగుతోందని సెటైర్లు వేశారు. విపక్ష పార్టీలు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌పై చేస్తున్న ఆరోపణలపై ఆయన తీవ్రస్థాయిలో విరుచుకపడ్డారు. ఎలక్షన్ కమిషన్‌లో అభిప్రాయభేదాలు ఉండటం సహజమని పేర్కొన్న ఎంపీ అర్వింద్.. రాజ్యాంగబద్ధంగానే అన్ని నిర్ణయాలు తీసుకుంటున్నారని వెల్లడించారు. గాంధీ కుటుంబానికి ఇలాంటివి ఏవీ అర్థం కావని ఫైర్ అయ్యారు. SIRలో భాగంగా ఎన్‌రోల్‌మెంట్ కోసం వస్తే మహేశ్ గౌడ్ స్పందించలేదని గుర్తుచేశారు.