National

రావణుడు కాదు..‘బొద్దింక’ దహనమే ఈసారి స్పెషల్!

దసరా అనగానే అందరికీ రావణాసురుడి దిష్టిబొమ్మను దహనం గుర్తుకువస్తుంది. దేశరాజధాని ఢిల్లీతో పాటు వివిధ రాష్ట్రాల్లోనూ ఈ ఆనవాయితీని పాటిస్తారు.ఈసారి కూడా రావణాసురుడి బొమ్మను దహనం చేసేందుకు ఢిల్లీలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కానీ,ఈసారి ఢిల్లీలో కేంద్రానికి వ్యతిరేకంగా వరుసగా నిరసనలు చేపడుతున్న కాక్రోజ్ జనతా పార్టీ (సీజేపీ) సింబల్ అయిన బొద్దింకను కూడా దహనం చేసేందుకు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. శ్రీ కేశవ్ రామలీలా కమిటీ ఆధ్వర్యంలో ఢిల్లీలోని నేతాజీ సుభాష్ ప్లేస్ మైదానంలో ఏకంగా 30 అడుగుల భారీ బొద్దింక (కాక్రోచ్) దిష్టిబొమ్మను ఏర్పాటు చేశారు.రావణాసురుడి బొమ్మతో పాటే బొద్దింక బొమ్మను కూడా ఇవాళ సాయంత్రం దహనం చేయనున్నారు.వాటితో పాటే కుంభకర్ణుడు, మేఘనాథుడి దిష్టిబొమ్మలను కూడా దహనం చేయనున్నట్టు శ్రీ కేశవ్ రామలీలా కమిటీ ప్రకటించింది.