తెలంగాణ
పాలిటిక్స్ కాదు.. అభివృద్ధే ముఖ్యం.. ఒకే ఫ్రేమ్‌లో పొన్నం, బండి!
కేంద్రమంత్రి బండి సంజయ్, అధికార కాంగ్రెస్‌కు చెందిన రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ తాజాగా ఒకే ఫ్రేమ్‌లో కనిపించారు. పొద్దున లేస్తే ఇరు పార్టీలకు చెందిన నేతలు విమర్శలు చేసుకోవడం కామన్. మంత్రి పొన్నం కేంద్రంలోని బీజేపీని విమర్శిస్తే.. కేంద్రమంత్రి బండి సంజయ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్నకాంగ్రెస్ పార్టీ మీద తీవ్ర విమర్శలు గుప్పిస్తుంటారు. కానీ, ఇవాళ వీరిద్దరూ నేతలు ఒకేసారి మీడియా ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు.ఎన్నికల వరకే రాజకీయాలు, ఆ తర్వాత కరీంనగర్ అభివృద్ధే లక్ష్యం అని తేల్చిచెప్పారు. ఎన్నికల తర్వాత వ్యక్తిగత రాజకీయాలకు అతీతంగా కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులంతా కలిసి ఉమ్మడి కరీంనగర్ జిల్లా అభివృద్ధికి కృషి చేయాలని నిర్ణయించుకున్నామని వెల్లడించారు.
