International
NorthKorea: దళాలు విధ్వంసకరంగా మారాలి.. కిమ్ జోంగ్ ఉన్ ఆదేశాలు!
ఉత్తర కొరియా తమ సైనిక, ఆయుధ సామర్థ్యాలను అత్యున్నత స్థాయికి తీసుకెళ్లేందుకు కసరత్తు వేగవంతం చేసింది. తమ దేశ ఫిరంగి దళాలు(ఆర్టిలరీ) ప్రపంచంలోనే అత్యంత కేంద్రీకృత, అత్యంత విధ్వంసకర శక్తిగా రూపాంతరం చెందాలని ఆ దేశ అధినేత కిమ్ జోంగ్ ఉన్ ఆదేశించారు. వారం రోజులుగా పలు ప్రధాన ఆయుధ తయారీ కర్మాగారాలను, క్షిపణి ఉత్పాదక కేంద్రాలను సందర్శించిన కిమ్, ఈ సందర్బంగా ఆర్మీ ఉన్నతాధికారులకు దిశా నిర్దేశం చేశారని ఉత్తర కొరియా అధికారిక వార్తా సంస్థ కేసీఎన్ఏ (KCNA) వెల్లడించింది.
